అంబులెన్స్ ఫస్ట్.. తమ వాహనాలను ఆపి దారిచ్చిన గవర్నర్!

  • రాజ్ భవన్ లో గవర్నర్ ఇఫ్తార్ విందు 
  • రాజ్‌భవన్‌కు వెళ్లే దారిలో వాహనాల నిలిపివేత
  • ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకోవడాన్ని గమనించి స్పందించిన గవర్నర్
రంజాన్ మాసం సందర్భంగా నేడు గవర్నర్ రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే ఈ విందులో పాల్గొనేందుకు గవర్నర్‌తో పాటు సీఎంలు కేసీఆర్, జగన్‌లు సంస్కృతి భవనం వద్దకు వెళుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది.

పోలీసులు రాజ్‌భవన్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఆ సమయంలో ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ చిక్కుకోవడాన్ని గమనించిన గవర్నర్ తమ వాహనాలను నిలిపివేసి అంబులెన్స్‌ను పంపారు. అంబులెన్స్ వెళ్లిన అనంతరం గవర్నర్‌తో పాటు ముఖ్యమంత్రుల వాహనాలు బయల్దేరి రాజ్‌భవన్‌కు వెళ్లాయి.
Go Back to Shorts
Narasimhan
KCR
Jagan
Ambulance
Rajbhavan
Traffic

More Telugu News